బీహార్ పిడుగుల బీభత్సం సృష్టిస్తున్నాయి. రోజూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. దీంతో పాటే పిడుగులు కూడా పడుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా పిడుగు పాటుకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అందులో బెగుసరాయ్ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. భాగల్‌పూర్, ముంగర్, కైమూర్, జము జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున పిడుగుపాట్లకు మరణించారు.
బీహార్‌లో జూన్ నెలాఖరులో ఒకేరోజు 83 మంది పిడుగుపాట్లకు బలయ్యారు. జూలై 3న ఒకేరోజు 25 మంది పిడుగులు పడి మృతి చెందారు. తాజాగా మృతి చెందిన వారితో కలిపి.. ఇప్పటివరకు బీహార్‌లో పిడుగుపాట్లకు ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 220 దాటింది.