ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముంబైలో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల రోడ్లపై వరద నీరు నిలవటంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.
మహారాష్ట్ర-కర్ణాటక తీరంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా సముద్రం, గుజరాత్ తీరానికి నైరుతీ, పశ్చిమ మధ్య, తూర్పుమధ్య, ఈశాన్య దిశగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని సముద్రంలో మృత్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.