పసిడి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి గుడ్ న్యూస్. బంగారం ధర గత 5 రోజులుగా తగ్గుతూనే వస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీలో బంగారం ధర బుధవారం స్వల్పంగా తగ్గింది. బుధవారం ఉదయం సెషన్‌లో 10 గ్రాముల బంగారం రూ.150 నష్టపోయి రూ.48,650 వద్ద ట్రేడ్ అయ్యింది. అంతేగాక ఆర్థిక వ్యవస్థలో రికవరీ ఆశలతో రిస్క్ అసెట్స్ అయిన ఈక్విటీల కొనుగోలుకు మొగ్గుచూపారు. ఆ కారణంగానే బంగారం ధర దిగి వచ్చిందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
హైదరాబాద్ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 దిగొచ్చింది. దీంతో ధర రూ.50,620కు క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం పరుగులు పెట్టింది. 10 గ్రాముల బంగారం ధర రూ.310 పెరుగుదలతో రూ.46,410కు చేరింది.