ఏపీలో కరోనా కేసులు రికార్డుస్థాయిలో పెరిగాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 16,882 శాంపిల్స్
ను పరీక్షించగా.. కొత్తగా 1500 మందికి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే కోవిడ్ వల్ల కర్నూల్ లో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు , కృష్ణ లో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు, చిత్తూరులో ఒకరు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకూ 277 మంది మరణించారు. అటు.. కొత్తగా 904 మంది కోలుకున్నారు. దాంతో మొత్తం 10,250 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా ప్రస్తుతం 10,544 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసులు మాత్రం 21,071 గా ఉన్నాయి.