యూపీలో కరోనా మహమ్మారి ఇటీవల రికార్డు స్థాయిలో విజృంభిస్తుంది. తొలుత ఉత్తరప్రదేశ్ లో కరోనా కేసులో తక్కువగా నమోదైనప్పటికీ.. ఇప్పుడిప్పుడు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఆందోళన వ్యక్తం అవుతుంది. గడిచిన 24 గంటల్లో 1,196 కొత్త కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 29,968కి చేరింది. అయితే, రాష్ట్రంలో రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కాస్తా ఉపశమనం అనిపిస్తుంది. ఇప్పటివరకూ 20,331 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. 9,980మంది చికిత్స పొందుతున్నారు.