స్కూల్ ఫీజు వసూలు చేయొద్దు: రాజస్థాన్ ప్రభుత్వం

Update: 2020-07-08 19:38 GMT

రాజస్థాన్ ప్రభుత్వం విద్యార్థుల తల్లదండ్రులకు శుభవార్త చెప్పింది. స్కూళ్లు రీ ఓపెన్ అయ్యే వరకూ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం పిల్లల నుంచి ఫీజులు వసూలు చేయకూడదని ఆదేశించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు కాస్తా ఊరట కలిగినట్టైంది. ప్రైవేట్ స్కూల్ లో ఫీజులు వసూలు చేయరాదని ఏప్రిల్ 9న ప్రభుత్వం ఆదేశించింది. గతంలో ఉత్తర్వులను మరోసారి గుర్తు చేస్తూ.. స్కూళ్లు తెరుచుకునే వరకూ ఫీజులు వసూలు చేయకూడదని ప్రకటించింది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా స్కూల్స్ మూతపడిన విషయం తెలిసిందే.

Similar News