ఛత్తీస్‌గఢ్‌లో 27 మంది మావోయిస్టుల లొంగిపోయారు. దంతెవాడ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో 27 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. వీరిలో రూ.లక్ష నగదు రివార్డు ఉన్న మావోయిస్టులు ఉన్నారని ఆయన తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల కోసం పోలీసులు పునరావాస చర్యలు ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. పోలీసులు నిర్ణయించిన పునరావాస చర్యలు ప్రభావితం చేయడంతోనే 27 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఆయన చెప్పారు.
ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులు చాలా ఆపరేషన్లలో పాల్గొన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. 2016 మార్చిలో ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయన మెయిల్వాడా మందుపాతర దాడితో వీరికి సంబంధం ఉందని వివరించారు.