గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను కాన్పూర్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు పోలీసులకు గాయాలు అయ్యాయని ఉన్నతాధికారులు తెలిపారు. వికాస్ దూబే ప్రయాణిస్తున్న కారు కాన్పూర్ లోని సంచెండీ సరిహద్దు దగ్గరకు రాగానే బోల్తా పడింది. దీంతో దూబే పోలీసుల నుంచి తుపాకీ లాక్కొని కాల్పులు జరిపి.. పారిపోయేందుకు ప్రయత్నించాడు. తరువాత పోలీసులు జరిపిన కాల్పుల్లో దూబే మరణిచాడు. దూబే పోలీసులపై జరిపిన కాల్పుల్లో నలుగురికి గాయాలవ్వగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.