క‌రోనా ఊర‌ట..62 శాతం దాటిన రిక‌వ‌రీ రేటు

Update: 2020-07-10 08:31 GMT

దేశంలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 24,879 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,67,296కు చేరింది. కొవిడ్‌ బారిన పడి కొత్తగా 487 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 21,129కి పెరిగింది. 487 మరణాల్లో 198 మహరాష్ట్రలోనివే కావడం గమనార్హం.

కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో దాదాపు 75 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, యూపీ, ఏపీ నుంచే ఉన్నాయి. కొవిడ్‌ సోకినవారిలో ఇప్పటివరకు 4,76,377 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 2,69,789 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 62.08 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Similar News