ఈ ఏడాది మార్చిలో నిజాముద్దీన్ మార్కాజ్‌లోని తబ్లిఘి జమాత్ సమాజంలో పాల్గొన్న మలేషియా పౌరులకు ఢిల్లీ సాకేత్ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరికి రూ .10 వేల వ్యక్తిగత బాండ్‌పై కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. 60 మంది మలేషియన్లు దేశం విడిచి వెళ్లే ముందు ఒక్కొక్కరు రూ. 7 వేలు జరిమానా చెల్లించాలంటూ ఢిల్లీ హైకోర్టు గురువారం స్పష్టం చేసింది.
కాగా కరోనా నేపథ్యంలో వీసా నిబంధనలతో పాటు భారత ప్రభుత్వం మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గానూ విదేశీయులపై కేసులు నమోదయ్యయి. కాగా మార్చిలో జాతీయ రాజధాని ఢిల్లీలో తబ్లిఘి జమాత్ నిర్వహించిన కార్యక్రమంలో చాలా మందికి కరోనా సోకగా.. వారు వివిధ ప్రాంతాలలో సంచరించడం వలన చాలా కేసులు పెరిగాయి.