సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ప్రైవేట్ స్కూళ్ల టీచర్లు లాక్‌డౌన్ వలన ఆర్థికంగా నష్టపోయారని.. వారిని ఆదుకోవాలని కోరారు. నెలకు పదివేలు చొప్పున మూడు నెలలు ఆర్థికసాయం చేయాలని కోరారు. ప్రైవేట్ స్కూళ్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ గడువుకూడా పొడిగించాలని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లకు ఆన్‌లైన్ క్లాసులకు అనుమతి ఇస్తే.. ప్రైవేట్ స్కూళ్లకు కూడా అనుమతి ఇవ్వాలని లేఖలలో కోరారు.