వ్యాక్సిన్ అందుబాటులోకి రాని కరోనా వైరస్ తో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది బాధితులు ఇబ్బందిపడుతున్నారు. కొన్ని లక్షల మంద ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో మైసూర్ పాక్ తింటే కరోనా నయమవుతుందని బురిడీకొట్టించాడు తమిళనాడుకు చెందిన ఓ స్వీట్ షాపు యజమాని. కోయంబత్తూరు జిల్లా తోటిపలేయంలోని తిరునేల్వలి లాలా స్వీట్ యజమాని తన వద్ద ఔషధ గుణాలున్న మైసూర్ పాక్ తింటే కరోనా ఒకే రోజులో నయమవుతుందని ప్రచారం చేశాడు. ఇలా మూడు నెలలుగా కస్టమర్లను అట్రాక్ట్ చేశాడు. తన తాత సిద్ధవైద్యం నేర్పించాడని ఔషధ మైసూర్ పాక్ తయారుచేసినట్టు యజమాని తెలిపాడు.
వాటిని తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని జనాలను నమ్మించాడు. దీనికి సంబంధించిన ప్రకటన సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. విషయం తెలుసుకున్న ఆహార ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు స్వీట్ షాపునకు చేరుకున్నారు. ఆ షాపు యజమాని వద్ద వివరాలను సేకరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా చేయడం తప్పని దుఃఖానికి సీల్ వేసేశారు. అమ్మకానికి రెడీగా ఉన్న 120 కిలోల మైసూర్ పాక్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.