పీజీ, యూజీ పరీక్షలపై యూజీసీ కీలక ప్రకటన

Update: 2020-07-09 18:58 GMT

కరోనా నేపథ్యంలో యూజీ, పీజీ పరీక్షలతో పాటు.. ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలపై సంధిగ్థత నెలకొంది. తాజాగా చివరి ఏడాది పరీక్షలపై యూజీసీ కీలక ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కు పరీక్షలు నిర్వహించాల్సిందేనని యూజేసీ సెక్రటరీ స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశామని అన్నారు. అయితే, పరీక్షలు ఆన్లైలోనైనా, ఆఫ్‌లైన్‌లో అయినా పరీక్షలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. కేంద్ర ఆరోగ్యశాక సూచనలు పాటించాలని అన్నారు. గతంలో కూడా ఈ నిర్ణయాన్ని ప్రకటించిన యూజీసీపై విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. గత సెమిస్టర్స్ ఫలితాల ఆధారంగా చివరి సెమిస్టర్ విద్యార్థులను పాస్ చేయాలని అన్నారు. తరువాత బెటర్ మెంట్ పరీక్షలు కావాలంటే నిర్వహించుకోవాలని విద్యార్థి సంఘాలు సూచిస్తున్నాయి. అయితే, పరీక్షలు రద్దు చేసి.. విద్యార్థుల అందరిని పాస్ చేయాలని మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలు యూజీసీని కోరిన సంగతి తెలిసిందే.

Similar News