సరిహద్దుల వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు మరో భారత జవాన్ అమరుడయ్యాడు. శుక్రవారం ఉదయం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ పాక్ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో పాకిస్థాన్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఆర్మీ జవాన్ మృతిచెందారు.
సరిహద్దు వెంట పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో హవిల్దార్ సంబూర్ గురుంగ్ తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్‌కి తరలించేలోపు జవాన్ మృతిచెందారని లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ వెల్లడించారు.