మహారాష్ట్రలో కొత్తగా 7862 కరోనా కేసులొచ్చాయి. దాంతో మహారాష్ట్రలో ధృవీకరించబడిన కేసుల సంఖ్య ఇప్పుడు 2,38,461 గా ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 5366 రికవరీలు, 226 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో జూలై 10 నాటికి, కోవిడ్ -19 నుండి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 1,32,625 మందికే చేరుకుంది.. వీరంతా డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో ఇప్పుడు 95,647 క్రియాశీల కేసులు ఉన్నాయి.
మరోవైపు రాష్ట్రంలో కరోనాకు కేంద్రంగా ఉన్న ముంబయిలో 1337 కొత్త కేసులొచ్చాయి. అలాగే గత 24 గంటల్లో 73 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ముంబైలోని కోవిడ్ -19 ద్వారా 5205 మంది రోగులు మరణించారు.