దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక అస్సాంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. అస్సాం రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 936 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హేమంత్ బిశ్వా తెలియజేశారు.
ఒక్క గువాహటి నగరంలోనే 521 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం పాజటివ్ కేసుల సంఖ్య 15,536కు చేరింది. కరోనా బారి నుంచి 9,848 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కారణంగా 35 మంది మృతిచెందారు.