ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో 77 మొబైల్ షాపులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
బొరివాలీలోని ఇంద్రప్రస్థ షాపింగ్ కాంప్లెక్సులో తెల్లవారుజామున 2:55 గంటలకు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న 14 ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు.