పసిడి కోనాలనుకునే వారికి గుడ్ న్యూస్. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి తాకిన పసిడి ధర శనివారం దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
ఇక హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా దిగొచ్చింది. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.260 పడిపోయింది. దీంతో ధర రూ.51,200కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.260 తగ్గుదలతో రూ.46,920కు పడిపోయింది.