సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుపై బీజేపీ ఎంపీ ఏమన్నారంటే..

Update: 2020-07-10 21:51 GMT

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సిబిఐ విచారణ చేయాలని ఆయన అభిమానులు నిరంతరం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బిజెపి ఎంపి రూప గంగూలీ, నటుడు శేఖర్ సుమన్ కూడా సిబిఐ దర్యాప్తుకు మద్దతు పలికారు. ఇప్పుడు ఆ జాబితాలో బిజెపికి చెందిన రాజ్యసభ ఎంపి, కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణియన్ స్వామి కూడా చేరారు. ఎప్పుడు రాజకీయాలపై మాట్లాడే సుబ్రమణ్య స్వామి సుశాంత్ సింగ్ మృతి కేసు విషయంలో జోక్యం చేసుకున్నారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తుకు అర్హత ఉందో లేదో అర్థం చేసుకోవడానికి ఈ కేసులోని వాస్తవాలను దర్యాప్తు చేయమని.. న్యాయవాది, ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు అయినా ఇషకరన్ సింగ్ భండారిని ట్విట్టర్ ద్వారా కోరారు.

Similar News