కంటైన్‌మెంట్ జోన్‌గా అమితాబ్ జల్సా రెసిడెన్స్

Update: 2020-07-12 15:12 GMT

బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అమితాబ్‌తో పాటు ఆయ‌న కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌కి కూడా క‌రోనా పాజిటివ్ గా వచ్చింది. దీంతో అమితాబ్, అభిషేక్ బ‌చ్చ‌న్‌లు నానావ‌తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వారు నివ‌సించే జ‌ల్సా ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు. బిల్డింగ్ బ‌య‌ట కంటైన్‌మెంట్ జోన్ అని బీఎంసీ అధికారులు.. నోటీసును అతికించారు. అనంత‌రం ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేశారు.

అమితాబ్ ఫ్యామిలీకి సంబంధించి జ‌యా బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్య‌రాయ్, ఆరాధ్య‌ల‌కి క‌రోనా టెస్టులు నిర్వ‌హించారు. రిపోర్ట్‌లో వారికి నెగెటివ్ అని తేలింది. గ‌త ప‌దిరోజులుగా త‌న‌తో కాంటాక్ట్ అయిన వారిని క‌రోనా పరీక్ష‌లు చేసుకోమ‌ని అమితాబ్ సూచించారు.

Similar News