ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గత 24 గంటలలో ఏకంగా 17 మంది మరణించారు.. అంతేకాదు కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 20,590 నమూనాలను పరీక్షించగా 1775 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇక కొత్తగా 1168 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ కారణంగా కర్నూల్ లో నలుగురు , గుంటూరు లో ముగ్గురు,
విజయనగరంలో ముగ్గురు , కృష్ణలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, కడప, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మరణించారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 24,422 పాజిటివ్ కేసు లకు గాను ఇప్పటివరకూ.. 12,399 మంది డిశ్చార్జ్ కాగా 309 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 11,714 గా ఉంది.