కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ రామ్‌కుమార్ రామమూర్తి సంస్థతో తనకున్న 23 సంవత్సరాల అనుబంధాన్ని వదులుకున్నారు. ఆ సంస్థకు రాజీనామా చేశారు. రిటైర్మెంట్ ఆలోచన నేపథ్యంలోనే రామ్‌కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు... జూలై 17, 2020 నుండి కాగ్నిజెంట్ నుండి పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నారు అని సిఇఒ బ్రియాన్ హంఫ్రీస్ ఉద్యోగులకు ఇచ్చిన నోట్‌లో పేర్కొన్నారు.
రామ్‌కుమార్ రామమూర్తి కంపెనీకి అందించిన సేవలు మరువలేనివని, సంస్థ ఉన్నతికి చాలా కృషి చేశారని బ్రియాన్ కొనియాడారు. ఇక గ్లోబల్ డెలివరీ హెడ్ ప్రదీప్ షిలిగే స్థానంలో ఆండీ స్టాఫోర్డ్‌ను భర్తీ చేసింది, స్టాఫోర్డ్ దాదాపు రెండు దశాబ్దాలు యాక్సెంచర్ లో పనిచేశారు. కాగా ప్రదీప్ షిలిగే కూడా 24ఏళ్ల పాటు కాగ్నిజెంట్ కు సేవలందించి తప్పుకోనున్నారు.