దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇక ముంబై నగరంలో కరోనా వైరస్ కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ రాష్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. తాజాగా కరోనా బారిన పడి
బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ అశోక్ ఖైర్నార్ ప్రాణాలు కోల్పోయారు. 57 ఏళ్ల అశోక్ ఖైర్నార్ ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, తుది శ్వాస విడిచారు.
అశోక్ ఖైర్నర్ ఫిబ్రవరి 1988 నుంచి ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. 2018 జనవరిలో ఆయన అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ముంబైలో కరోనాపై జరుగుతున్న పోరాటంలో అశోక్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాగా, ఇప్పటివరకు 100 మందికి పైగా బీఎంసీ ఉద్యోగులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రెండు వేలకు పైగా సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.