సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 250మంది వైద్యవిద్యార్థులు కజకిస్తాన్ లో చిక్కున్నారని.. వారిని స్వస్థలాలకు చేర్పించే ఏర్పాటు చేయాలని లేఖలో తెలిపారు. ఇండియాకు విమానాలు లేకపోవడంతో గత 3 రోజులుగా విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నారని అన్నారు. ఆన్‌లైన్ పరీక్షలు పూర్తిచేసి రాష్ట్రానికి పయనమవ్వడానికి సిద్దమైనా.. రవాణా సదుపాయం లేదని లేఖలో తెలిపారు. విద్యార్థులు అక్కడ చిక్కుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని లేఖలో తెలిపారు. దీంతో కేంద్రం తక్షణమే స్పందించి విద్యార్థులను స్వస్థలాలకు చేర్చాలని అన్నారు.