గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా హార్దిక్ పటేల్ నియమితులయ్యారు. 2015లో చేపట్టిన ఉద్యమంతో హార్దిక్ పటేల్ వెలుగులోకి వచ్చారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో పటీదార్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ 2015లో ఉద్యమం చేపట్టారు. దీంతో పటీదార్ ఉద్యమ నాయకుడుగా వెలుగులోకి వచ్చారు. అనంతరం ఆయన నేతృత్వంలోని పటీదార్ అన్‌మత్ ఆందోళన్ సమితి 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది.