ఆగస్టులో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు!

Update: 2020-07-12 14:50 GMT

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టులో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్దం అవుతున్నట్టు తెలుస్తుంది. పార్లెమంటరీ వ్యావహారాల శాఖ మంత్రి ప్రహాద్ జోషి మాట్లాడుతూ.. వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తామని.. అయితే, ఏ విధంగా జరిపించాలో అనే దానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని అన్నారు. ఆగస్టు రెండోవారం కానీ, మూడో వారం కానీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని.. పార్లమెంట్ అధికార వర్గాలు చెబుతున్నారు. కరోనా సంక్షోభంతో లోక్‌సభ, రాజ్యసభ సమావేశాల నిర్వాహణ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. సామాజిక దూరం పాటిస్తూ.. కరోనా నిబంధనలు పాటిస్తూ సమావేశాలు నిర్వహించడం కష్టంగా మారుతుంది. దీంతో సమావేశాల నిర్వాహణ సాద్య, అసాద్యాలపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఎంపీలతో మాట్లాడుతున్నారు. ఎంపీల సీటింగ్ ఏర్పాట్ల గురించి ఉభయ సభలతో పాటు, సెంట్రల్ హాల్ లను పరిశీలిస్తున్నారు.

Similar News