200 మంది క్యాబిన్ సిబ్బందికి ఎయిర్ ఇండియా షాక్

Update: 2020-07-11 23:01 GMT

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంపై చెడు ప్రభావాన్ని చూపిన సంగతి తెలిసిందే. తాజాగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న 200 క్యాబిన్ సిబ్బందిని ఎయిర్ ఇండియా తొలగించింది. కాంట్రాక్టు ప్రాతిపదికన చేర్చుకున్న క్యాబిన్ సిబ్బందిని రద్దు చేసినట్లు వర్గాలు తెలిపాయి. ఇదే కాకుండా రాజీనామా ఉపసంహరించుకోవాలని 50 మందికి పైగా పైలట్ల అభ్యర్థనను జాతీయ క్యారియర్ నిర్వహణ తిరస్కరించిందని వర్గాలు తెలిపాయి.ఈ 50 పైలట్లు ప్రస్తుతం తమ నోటీసు వ్యవధిలో పనిచేస్తున్నారని వారు తెలిపారు.

COVID-19 కారణంగా క్యాబిన్ సిబ్బంది ఒప్పందాలను రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్యాబిన్ సిబ్బందిని 2019 లో శిక్షణ కోసం నియమించారు. 2019 నవంబర్‌లో సుమారు 180 క్యాబిన్ సిబ్బందిని ఎయిరిండియా నియమించింది. తాజాగా వీరిని తొలగించడంతో వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా లాక్ డౌన్ అనంతరం ఇటీవలి నెలల్లో నడుస్తున్న విమానాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.

Similar News