తూత్తుకుడి లాకప్ డెత్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమతి

Update: 2020-07-12 13:49 GMT

తమిళనాడులో కరోనా నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా జయరాజ్, ఆయన కుమారుడు జే బెనిక్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్న విషయం తెలిసిందే. అయితే, తరువాత వారిద్దరూ చనిపోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, తాజాగా ఇదే విషయంపై ఐక్యరాజ్య సంస్థ ప్రతినిథులు దీనిపై స్పంధించారు. ఈ కేసు దర్యాప్తు సంపూర్ణంగా, నిస్పక్షపాతంగా జరగాలని యూఎన్ఓ సెక్రటరీ జనరల్‌కు అధికార ప్రతినిథి స్టెఫానే డుజరిక్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలకరుల సమావేశంలో ఈ మేరకు స్పందించారు.

తమిళనాడులో జయరాజ్ సతుంకుళం మెయిన్ బజార్ ఏరియాలో ఓ దుకణం నడుపుతున్నారు. అయితే, జూన్ 19న కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు జయరాజ్ ను స్టేషన్ ను తీసుకొని వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న జయరాజ్ కుమారుడు జే బినిక్స్ స్టేషన్ కు వెళ్లాడు. దీంతో ఇద్దర్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. తరువాత.. గాయపడిన వీరిద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారని.. చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారని కేసు నమోదైంది. ముందుగా ఈ కేసును సీబీసీఐడీ దర్యాప్తు చేయగా.. తరువాత, సీబీఐకి అప్పగించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఐదుగురు పోలీసులను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ ఘటనపై విలేకర్ల అడిగిన ప్రశ్నలకు యూఎన్ఓ సెక్రటరీ జనరల్‌కు అధికార ప్రతినిథి స్టెఫానే డుజరిక్ ఈవిధంగా స్పందించారు.

Similar News