అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బత్తలపల్లి ఇందిరమ్మ కాలనీవద్ద ఆదివారం ఉదయం జరిగింది. ఆదివారం ఉదయాన్నే తాడిమర్రి మండలం పిన్నదరికి చెందిన కొందరు బొప్పాయి పళ్లను బత్తలపల్లి మార్కెట్‌లో అమ్మేందుకు ఆటోలో వస్తున్నారు.
ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో సూరి, ఆదమ్మ దంపతులు, చెన్నకేశవ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.