కరోనాపై అవగాహనా ర్యాలీ నిర్వహించిన హిజ్రాలు

Update: 2020-07-11 19:25 GMT

కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు కరోనాపై ముందుండి పోరాటం చేస్తున్నారు. సామాజిక బాధ్యత ఉన్న వారు చాలా మంది ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా, తమిళనాడులో హిజ్రాలు కరోనాపై అవగాహన కల్పించారు. చెన్నైలోని తోండియార్‌పేట, నేతాజీ నగర్ మార్కెట్ ప్రాంతాల్లో చెన్నై కార్పొరేషన్ వాలంటీర్లతో కలిసి అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. కరోనా విషయంలో ముందు భయాన్ని దూరం చేయాలని అన్నారు. మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించడం ద్వారా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు.

Similar News