పాన్ కోసం పారిపోయిన క‌రోనా రోగి

Update: 2020-07-13 12:41 GMT

దేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రోగులతో హాస్పిటల్‌లు నిండిపోతున్నాయి. అయితే ఆస్పత్రులు, క్వారంటైన్ సెంటర్ల నుంచి కొందరు పారిపోతున్నారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేవని కొందరు.. కుటుంబంపై బెంగపెట్టుకున్నామని మరి కొందరు.. రకరకాల కారణాలతో హాస్పిటల్ నుంచి రోగులు పారిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఓ క‌రోనా రోగి త‌న‌కిష్ట‌మైన పాన్ కోసం ఆస్ప‌త్రి నుంచి పారిపోయాడు. ఆగ్రాలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.

ఆగ్రాకు చెందిన 35 ఏళ్ల వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో అత‌న్ని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ఆస్ప‌త్రిలో చేర్చారు. అయితే అత‌నికి పాన్ అంటే చాలా ఇష్టం. ఈ క్ర‌మంలో శ‌నివారం సాయంత్రం హాస్పిటల్ నుంచి వెళ్లిపోయాడు. ఈ విష‌యాన్ని ఎవ‌రూ గ‌మ‌నించ‌లేదు. లాక్ డౌన్ కార‌ణంగా ఆస్ప‌త్రి ప‌రిస‌రాల్లో ఎలాంటి షాపులు ఓపెన్ చేయలేదు. దీంతో ఆ క‌రోనా రోగి గాంధీ న‌గ‌ర్ వెళ్లాడు. అక్క‌డ ఓ షాపులో పాన్ తీసుకుని తిన్నాడు. అనంత‌రం అక్క‌డున్న త‌న బంధువుల ఇంటికెళ్లి.. త‌న‌ను ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చేర్పించండి అని కోరాడు. చేసేదేమీ లేక వారు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, వైద్యులు అత‌న్ని తిరిగి ఐసోలేష‌న్ వార్డుకు త‌ర‌లించారు.

Similar News