అసోంలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఏకంగా 950 గ్రామాలను అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు రావడంతో.. బార్పేట జిల్లాలోని ఓ గ్రామం వరద ముంపునకు గురైంది. వరద బాధితులను ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కాపాడింది. 487 మందిని బోట్లలో సురక్షిత ప్రాంతానికి తరలించారు.
వరద బాధితులకు మాస్క్ లు పంపిణీ చేసి, వారు సామాజిక దూరం పాటించేలా చూస్తున్నారు. వరదబాధిత ప్రాంతాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి వరద సహాయ పనులు చేపట్టారు. పుతిమర్రి, బేకి, ఐ, పహుమర నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలు నీట మునిగాయి.
అసోంలోని జోర్హాట్, బోనగైగాం, కామెరూప్ మెట్రో, కామెరూప్ రూరల్, బక్సా, బార్పేట, కచర్, శివసాగర్, సోనిట్ పూర్, ధీమాజీ, తిన్ సుకియా ప్రాంతాల్లో 11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.