గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. కేరళ సీఎం పినరయి విజయన్ పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి సీఎంపై అవిశ్వాస తీర్మాణం పెట్టేందుకు సిద్ధమైంది. సీఎం పాటు.. స్పీకర్ రామకృష్ణన్ ను కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ తో ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల నేతృత్వంలో సీఎం, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడం, వారి రాజీనామాలు డిమాండ్ చేయడం వంటి అంశాలపై నిర్ణయం తీసుకున్నామని ఓ ప్రతిపక్ష నేత అన్నారు. అటు, సీఎం రాజీనామా చేసే వరకూ తాము నిరసన కొనసాగిస్తామని.. సీఎం కార్యదర్శి ఒకరు నిందితుల్లో ఉన్నారని యూడీఎఫ్ కన్వీనర్ ఆరోపించారు.