పసుపులో క్యాన్సర్ కణాలను నిరోధించే కారకాలు..

Update: 2020-07-14 14:31 GMT

మనం నిత్యం వంటకి ఉపయోగించే పసుపులో ఉండే కర్కుమిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటి) పరిశోధకులు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. క్యాన్సర్ కణాల మరణానికి కారణమయ్యే కర్కుమిన్ లుకేమియా కణాల సున్నితత్వాన్ని గణనీయంగా పెంచిందని అధ్యయనం తెలిపింది. క్యాన్సర్ చికిత్సలో, శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలకు ఏవిధమైన నష్టం కలగకుండా క్యాన్సర్ కణాల నిర్మూలనా సామర్ధ్యాన్ని పెంచడం చాలా ముఖ్యం. ఐఐటి మద్రాసులోని బయోటెక్నాలజీ విభాగం రామా శంకర్ వర్మ, భూపత్ మరియు జ్యోతి మెహతా స్కూల్ ఆఫ్ బయోసైన్సెస్ ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు. కర్కుమిన్ ఇప్పటికే క్యాన్సర్ నిరోధక కారకంగా ప్రసిద్ధి చెందిందని నిరూపించబడింది. ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ తదితర కేసులలో దాని పనితీరు మెరుగ్గా ఉందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

Similar News