కరోనా కంట్రోల్ కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Update: 2020-07-13 19:20 GMT

కరోనావైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి వారాంతాల్లో రాష్ట్రవ్యాప్తంగా కఠినమైన ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించింది,

దీంతో ఆదివారం లాక్ డౌన్ విధిస్తున్న కర్ణాటక , తమిళనాడుల సరసన చేరింది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, బీహార్ లలో ఇప్పటికే ప్రాంతాల వారీగా లాక్ డౌన్ ప్రకటించిన రాష్ట్రాలలో ఉన్నాయి. కర్ణాటక ప్రభుత్వం జూలై 14 నుండి ఏడు రోజులపాటు బెంగళూరులో పూర్తి లాక్ డౌన్ ను ప్రకటించింది. తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి మదురై, పరివాయి నగరాలలో సహా సమీప ప్రాంతాలలో జూలై 14 వరకు ఆంక్షలను కఠినతరం చేశారు.

Similar News