దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక తమిళనాడులో కరోనా స్వైర విహారం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చెన్నైలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ట్రాన్స్‌జెండర్లు పోరాడుతున్నారు. స్వచ్ఛంద సంస్థల సభ్యులతో కలిసి సేవలందిస్తున్నారు. రద్దీ మురికివాడల్లో, భారీగా కేసులున్న ప్రాంతాల్లోనూ తిరుగుతూ ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కొవడంలో ప్రభుత్వ అధికారులతో కలిసి ట్రాన్స్‌జెండర్లు ప్రచారం చేస్తున్నారు. చెన్నై కార్పొరేషన్ భాగస్వామ్యంతో ట్రాన్స్‌జెండర్లు రోజుకు ఎనిమిది గంటల పాటు ప్రచారం పాల్గొంటున్నారు. వంద రోజుల ఉపాధి పథకంలో భాగంగా వారికి నెలకు రూ.15వేలు, అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.
అధికారులు తమకు తమకు ప్రాథమికంగా అవగాహన, నివారణ, నియంత్రణ బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమంలో కాలినడకన ఇంటింటికీ వెళ్లి వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, రోగ నిరోధక శక్తిని పెంచే చర్యలపై వివరిస్తున్నట్లు ఎన్జీవో జనరల్ మేనేజర్ జయ తెలిపారు