దేశంలో రికార్డుస్థాయిలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-07-15 11:37 GMT

దేశంలో కరోనా వైరస్‌ కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా ఉధృతి కొనసాగుతున్నది. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గత పది రోజులుగా ప్రతిరోజు రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 29,429 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 582 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9,36,181కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 3,19,840 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ బారినపడిన వారిలో 5,92,032 మంది బాధితులు కోలకున్నారు. ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు 24,309 మంది ప్రాణాలు కోల్పోయారు.

Similar News