ఈరోజు సాయంత్రం 7:30 రాజస్థాన్ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సచిన్ పైలట్ తో సహా మరో ఇద్దరు మంత్రులను తొలగించిన తరువాత జరుగుతున్న మొదటి సమావేశం ఇది. ఇప్పటికే క్యాబినెట్ సమావేశానికి సంబంధించి అందరూ మంత్రులకు సమాచారం అందింది.
కాగా రాజస్థాన్ లో సచిన్ పైలట్‌ను ఉప ముఖ్యమంత్రిగా తొలగించిన తరువాత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గవర్నర్ కలరాజ్ మిశ్రాతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా సచిన్ పైలట్ సహా ఇద్దరు మంత్రులు తొలగింపుపై గవర్నర్ కు సమాచారం ఇచ్చారు. అలాగే అసెంబ్లీలో తనకు పూర్తి మెజారిటీ ఉందని గవర్నర్‌కు వివరించారు.