ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

Update: 2020-07-16 09:05 GMT

ఏపీలో ఇళ్ల పట్టాలకోసం భూసేకరణ చేస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇప్పటికే నిర్మించిన గృహాలను ఎందుకు పంపిణి చేయలేదని ప్రశ్నించింది. ఆ ఇళ్లకు కనీసం విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు. ఆ వ్యవహారాన్ని వదిలేసి ఇళ్ల స్థలాల పంపిణి పేరుతో హడావిడి చేయడం ఏమిటని నిలదీసింది. బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం పశువుల మేతకోసం కేటాయించిన భూములను, చెరువులు, కుంటలు నదుల తీరా ప్రాంతాన్ని ఇతర అవసరానికి ఉపయోగించడం కుదరదని స్పష్టం చేసింది. ఈ ఆర్డర్స్ కు విరుద్ధంగా ఎలా జీవో జారీ చేశారని నిలదీసింది.

ఇళ్ల స్థలాల పంపిణి పేరుతో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరికాదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భూముల సేకరణకు ఎలాంటి విధానం అమలు చేస్తున్నారో చెప్పాలని ఆదేశించింది. చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన రెండు పిటిషన్ల విచారణ సందర్బంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తమ భూముల్ని అక్రమంగా తీసుకుంటున్నారంటూ అనేకమంది ఆశ్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. అవసరమైతే సింగల్ జడ్జి వద్ద అన్ని పిటిషన్లను ధర్మాసనం ముందుకు తెప్పించుకొని విచారణ చేపడతామని తెలిపింది.

Full View

Similar News