బీహార్ లో కరోనా వైరస్ కేసులు 20 వేల మార్కును దాటింది. దీంతో కేసులను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు నుంచి అక్కడ లాక్ డౌన్ విధిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా ఉంటాయని జూలై 31 వరకు ఇలాగే కొనసాగుతుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారం బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ రాష్ట్రంలో 16 రోజుల లాక్ డౌన్ గురించి తెలియజేశారు. దాదాపు 38 జిల్లాల్లో మూడవ వంతు ఇప్పటికే షట్ డౌన్ లో ఉంది.