తిరుమలలో పెరుగుతున్న కరోనా.. తాజాగా 11 మందికి..

Update: 2020-07-16 14:18 GMT

కరోనా మహమ్మారి అన్ని రంగాల్లో విస్తరిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కేసులు మాత్రం తగ్గడం లేదు. కరోనా సెగ టీటీడీకి కూడా తగిలింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కరోనా 11 మంది టీటీడీ అర్చకులకు సోకింది. దీంతో.. మొత్తం 15 మంది అర్చకులు కరోనా బారిన పడ్డారు. దీంతో వెంటనే అర్చకులను క్వారంటైన్‌కు తరలించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా తిరుమల దేవస్థానం మూతపడి.. ఇటీవలే మళ్లీ తెరుచుకున్న సంగతి తెలిసిందే.

Similar News