ఢిల్లీలో ఖాళీ అవుతున్న కోవిడ్ సెంటర్లు

Update: 2020-07-16 09:26 GMT

రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నాయి. గత నెల పలు అధ్యయనాలు జూలై చివరి నాటికి ఢిల్లీలో ఐదున్నర లక్షలు కేసులు నమోదవుతాయని తెలిపారు. అయితే, పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా కనిపిస్తుంది. రికవరీ రేటు 80 శాతానికి మించి ఉంది. అటు, రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో కూడా కనిపిస్తుంది. గత నెల అధ్యయనాలు చెప్పిన అంచానాలలో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా మేల్కొని పలు కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇండోర్ స్టేడియంలను తాత్కాలిక ఆస్పత్రులుగా మార్చాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఢిల్లీలోని తొలుత షెహనాయ్ బ్యాంకెట్ హాల్‌ను కోవిడ్ సెంటర్‌గా మార్చారు. 100 మంది రోగులకు సరిపడే సెంటర్ ను ఏర్పాటు చేయగా.. అందులో ఒకేసారి 60 మంది రోగులు చేరారు. అయితే, జూలై 15 నాటికి అక్కడ ఒక్కరోగి కూడా లేరు. దీని గురించి మాట్లాడిన ఎల్‌ఎన్‌జెపీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్.. ఇక్కడ ఉన్న రోగులలో కొంతమంది తూర్పు ఢిల్లీలోని కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ కోవిడ్ కేర్ సెంటర్‌కు త‌ర‌లివెళ్లార‌న్నారు. ఢిల్లీలో గ‌త రెండు వారాలుగా రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింద‌న్నారు. ఇంతకుముందు ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రికి రోజూ 100 నుంచి 110 మంది క‌రోనా బాధితులు వచ్చేవార‌న్నారు. ఇప్పుడు 50 నుంచి 60 మంది రోగులు మాత్రమే రోజూ వ‌స్తున్నార‌న్నారు.

Similar News