బీసీసీఐ ప్రెసిడెంట్, టీమ్ ఇండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ హోమ్ క్వారెంటైన్‌లోకి వెళ్లారు. దాదా సోదరుడు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ స్నేహశీష్ గంగూలీకి కరోనా సోకడంతో.. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల నుంచి స్నేహశీష్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన కరోనా పరీక్షలు చేపించుకున్నారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అవ్వగానే.. బెల్లీ వ్యూ ఆస్పత్రిలో చేరారు. దీంతో గంగూలీ కొద్ది రోజులు గృహ నిర్బంధంలో ఉంటాడని తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం స్నేహశీష్ భార్య, ఆమె తల్లిదండ్రులు కరోనా బారినపడ్డారు. ఇటీవల ఇండియాటుడేతో మాట్లాడిన గంగూలీ వైరస్ విజృంభణతో జీవితంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పాడు.