ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు

Update: 2020-07-16 17:49 GMT

ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 22,304 శాంపిల్స్‌ ని పరీక్షించగా 2,584 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అలాగే కొత్తగా 943 మంది కోవిడ్‌ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌ వల్ల తూర్పు గోదావరి లో ఎనిమిది మంది, ప్రకాశం లో ఎనిమిది మంది, చిత్తూరు

లో ఐదుగురు, కడప లో నలుగురు, అనంతపూర్‌ లో ముగ్గురు, గుంటూరు లో ముగ్గురు, నెల్లూరు లో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు, కర్నూల్‌ లో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు మరణించారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 12,40,267 శాంపిల్స్‌ ని పరీక్షించారు. రాష్ట్రంలో 15,285 మంది ఆసుపత్రులలో మరియు 2,874 మంది కోవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ లో కలిపి మొత్తం 18,159 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 35,159 పాజిటివ్ కేసు లకు గాను 16,975 మంది డిశ్చార్జ్ కాగా 492 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 17,692 గా ఉంది.

Similar News