మహారాష్ట్రలోని ముంబైతోపాటు.. చుట్టు పక్కల ప్రాంతంలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ముంబై వాతావరణ కేంద్రం తెలిపింది. ముంబైలో మాత్రం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 150 నుంచి 200 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన ముంబై వాతావరణశాఖ అధికారులు ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రావద్దని, సముద్ర తీరప్రాంతాలకు వెళ్లవద్దని కోరారు. లోతట్టుప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.