హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

Update: 2020-07-15 19:07 GMT

బుధవారం హైదరాబాద్ లో వర్షం దంచికొట్టింది. దాంతో నగరంలోని రోడ్లు జలమయం అయ్యాయి. ఉప్పల్‌, నాగోల్‌, ఈసీఐఎల్‌, చిక్కడపల్లి, బాలానగర్‌, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మూసాపేట, కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, ప్రగతినగర్ లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక నగరంలో ని ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలోకి భారీగా వర్షపు నీరు చేరింది.

మరోవైపు రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. బుధవారం మధ్యాహ్నం వరకు సంగారెడ్డి జిల్లా అన్నసాగర్‌లో 15.3 సెం.మీ, కామారెడ్డి జిల్లా సోమూర్‌లో 10.6 సెం.మీ, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 12 సెం.మీ, మేడ్చల్‌ జిల్లా బాలానగర్‌లో 8.7 సెం.మీ, భద్రాద్రి జిల్లా సీతారామపట్నంలో 9.6 సెం.మీ, కామారెడ్డి బిచుకుందా 8.6 సెం.మీ, సంగారెడ్డి జిల్లా కాంగెటిలో 8.7 సెం.మీల వర్షపాతం నమోదైంది.

Similar News