మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ బావమరిది సంజయ్ సింగ్ మసానిని రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమించారు. కాంగ్రెస్ తరపున, మసానిని ప్రాంతీయ సమన్వయకర్తగా మరియు రాష్ట్రంలో అసెంబ్లీ ఉప ఎన్నికలలో ప్రచారం కోసం ఇన్‌చార్జిగా కూడా నియమించారు. ఆయన ఆయా ప్రాంతాలలో పర్యటించి ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తారని క్యాడర్ కు సమాచారం ఇచ్చారు. కాగా సంజయ్ సింగ్ 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన తన బావ శివరాజ్ సింగ్ ప్రభుత్వంపై పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనకు బాలాఘాట్ జిల్లాలోని వరసివాని అసెంబ్లీ సీటు ఇచ్చారు రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్.