క్వారంటైన్‌లో గంగూలీ..

Update: 2020-07-16 12:43 GMT

బిసిసిఐ అధ్యక్షుడు, టీమ్ ఇండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తన అన్నయ్య క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సిఎబి) సంయుక్త కార్యదర్శి స్నేషసిష్ గంగూలికి పాజిటివ్ రావడంతో ముందు జాగ్రత్త చర్యగా గృహనిర్భంధంలో ఉన్నారు. బెంగాల్ మాజీ ఫస్ట్ క్లాస్ ఆటగాడు స్నేహశిష్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కోల్ కతాలని బెల్లెవి ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న క్రమంలో పరీక్షలు చేయించగా పాజిటివ్ వచ్చింది. అన్నయ్య ప్రతిరోజూ మా ఫ్యాక్టరీలను సందర్శిస్తాడు. ఈ క్రమంలోనే అతడికి కొవిడ్ వచ్చింది. అతడి భార్య, ఆమె తల్లిదండ్రులు కూడా కరోనా బారిన పడడంతో ఆయన బెహాలాలోని స్వగృహానికి వచ్చారు. కాగా గంగూలీ కుటుంబం బెహాలాలోనే నివసిస్తోంది. అన్నయ్యకు ప్రమాదం పొంచి ఉందని ముందే గ్రహించానని గంగూలీ అన్నారు. వైరస్ విజృంభణతో జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయని గంగూలీ చెప్పారు.

Similar News