ముంబైలో గురువారం భవనం కుప్పకూలిన రెండు సంఘటనలలో ఇద్దరు మరణించారు.. 15 మంది గాయపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు సబర్బన్ మాల్వానీలో 'చాల్' ఒక భాగం కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, దక్షిణ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో పాత భవనం కూలిపోవడంతో చాలా మంది శిధిలాల కింద చిక్కుకున్నారని పౌర అధికారులు తెలిపారు.
పశ్చిమ శివారులోని మాల్వాని గేట్ నంబర్ 5 దగ్గర మూడు అంతస్తుల చాల్‌లో ఒక భాగం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కూలిపోయిందని అగ్నిమాపక దళం అధికారి తెలిపారు.
దీంతో నాలుగు ఫైర్ ఇంజన్లు, ఒక రెస్క్యూ వ్యాన్ , అంబులెన్స్‌లను సంఘటన స్థలానికి తరలించగా, 15 మందిని శిధిలాల నుంచి రక్షించినట్లు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) తెలిపింది. భవనాలు కూలిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు, గాయపడిన వారిని మలాడ్ ఈస్ట్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి పంపించి చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు బిఎంసి అధికారి తెలిపారు.