కరోనా పరీక్షలు నిర్వహించడంలో అమెరికా తరువాత.. భారత్ టాప్ లో ఉందని.. వైట్ హౌస్ తెలిపింది. మీడియా సమావేశంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు.. వైట్ హౌస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ ఈ మేరకు సమాధానం చెప్పారు. అమెరికాలో ఇంత వరకూ 4.2 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేయగా.. 1.2 కోట్లమందికి భారత్ లో పరీక్షలు జరిగాయని ఆమె తెలిపారు. కరోనా పరీక్షలు ఎక్కువగా జరగటం వలన అమెరికాలో ఎక్కువ పాజిటివ్ కేసులు బయటడుతున్నాయని అన్నారు. అమెరికాలో ఇప్పటి వరకూ 35 లక్షల కరోనా కేసులు బయటపడ్డాయి. కాగా.. 1.38 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అటు, భారత్ లో 1,003,832 కరోనా కేసులు నమోదవ్వగా.. 25,602 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 1.36 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.86 లక్షల మంది కరోనాతో మృతి చెందారు.